టీ-కాంగ్రెస్ హౌస్ ఫుల్ !

రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగొచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ విషయంలోనూ అదే జరుగుతోంది. ఇన్నాళ్లు బోసిపోయి ఉన్న టీ-కాంగ్రెస్ లో నూతనోత్సాహం వచ్చినట్టు కనబడుతోంది. టీ-టీడీపీ సీనియర్ నేత రేవంత్ రెడ్డి కాంగ్రెస్’లో చేరబోతున్నట్టు వార్తలొస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని కాంగ్రెస్ అధిష్టానం అధికారికంగా ప్రకటించకపోయినా.. నిజమేనన్నట్టు లీకులు ఇస్తోంది.

ఇటీవలే తెలంగాణ కాంగ్రెస్ ఇన్ ఛార్జిగా బాధ్యతలు స్వీకరించిన కుంతియా ఆసక్తికరమైన ప్రకటన చేశారు. తెలంగాణ‌లో టీఆర్ఎస్‌, టీడీపీ, బీజేపీ నుంచి మ‌రికొంత మంది నేత‌లు కాంగ్రెస్‌లో చేరుందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. 2019 ఎన్నికలో కాంగ్రెస్ దే అధికారం అంటున్నారాయన. ఒక్క రేవంత్ రెడ్డి రాకతోనే కాంగ్రెస్ కు అధికారం వచ్చినట్టు కటింగ్ ఇస్తున్నారు.

మరీ.. నిజంగా కుంతియా మాటలు నిజమై.. టీ-కాంగ్రెస్ కు హౌస్ ఫుల్ బోర్డు పెట్టుకొనే పరిస్థితి వస్తుందేమో చూడాలి.

Related posts:

loading...