పవన్ కళ్యాణ్ కు వర్మ బహిరంగ లేఖ..

దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ మరోసారి పవన్ కళ్యాణ్ ను ప్రస్తావన తీసుకొచ్చారు. గత కొంత కాలంగా పవన్ కళ్యాణ్ ను ఊసు లేకుండా వర్మ ఇప్పుడు ఏకంగా ఒక బహిరంగ లేఖ రాశారు. ఇజం పుస్తకంపై స్పందిస్తూ ఈ లేఖ సంధించాడు. పవన్‌ కల్యాణ్‌ రాసిన ‘ఇజం’ పుస్తకం కంటే పవనిజమే నచ్చిందని అంటున్నాడు వర్మ.

ఇంతకీ వర్మ రాసిన లేఖలో ఏముందంటే.. ‘ఇజం గురించి మాట్లాడేముందు మీకో విషయం చెప్పాలి. పార్టీ పెట్టాలన్న మీ ఐడియా నాకు చాలా నచ్చింది. మీలో ఎప్పుడూ నచ్చేది మీ నిజాయతీనే. అంతేకాదు మీరు జనసేన పార్టీ పెట్టిన తర్వాత మొదటిసారి ఇచ్చిన ప్రసంగం కూడా చాలా నచ్చింది. ‘మీరు ‘ఇజం’ అనే పుస్తకాన్ని రాశారని తెలీగానే నాలో ఏదో తెలీని ఉత్సుకత. చిన్నప్పటి నుంచి విపరీతంగా పుస్తకాలు చదివే అలవాటు ఉండడంతో మీ పుస్తకం కూడా చదివాను. మీరు పుస్తకంలో ప్రస్తావించినఅంశాలు, భావాలను చదివాక నాకు ఒక్కటే అర్థమైంది. ఆ పుస్తకంలో ఉన్నదానికంటే ఎక్కువ జ్ఞానం మీలో ఉంది. . బ్రూస్లీ గొప్ప మార్షల్‌ ఆర్టిస్ట్. అంతేకాదు గొప్ప దార్శనికుడు కూడా. ఆయనికంటూ ఓ అభిప్రాయం విధానం వుంది. మనమేం ఆలోచించాలన్నా ఏం చెప్పాలన్నా అది మన స్టైల్లోనే ఉండాలి. మీ శ్రేయోభిలాషిగా మిమ్మల్ని ఒక్కటే వేడుకొంటున్నాను. చెడు విషయాలు, ఆలోచనలు మిమ్మల్ని ప్రభావితం చేయకుండా చూసుకోండి. ఆఖరిగా ఒక్కమాట. మీరు రాసిన ‘ఇజం’ పుస్తకం నన్ను నిరాశపరిచింది. కానీ నాకు పవనిజంపై నమ్మకం ఉంది’ అని తన లేఖలో రాసుకొచ్చాడు వర్మ.

Related posts:

loading...