తెలంగాణలో ఏపీ మంత్రులకు పనేంటీ ?

పార్టీ మారబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతున్న టీ-టీడీపీ సీనియర్ నేత రేవంత్ రెడ్డి ఏపీ టీడీపీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఏపీ మంత్రులకి సంబంధాలు ఉన్నట్టు ఆరోపించారు. ఏపీ మంత్రులు కొంద‌రు అప్పుడ‌ప్పుడు తెలంగాణ‌లో క‌నిపిస్తున్నారు. వారికి తెలంగాణ రాష్ట్రంలో ప‌నేంటీ ? అని ప్రశ్నించారు.

త‌మని జైల్లో పెట్టించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి ఏపీ టీడీపీ నేత‌లు వంగి వంగి దండాలు పెడ‌తారా ? అని ప్ర‌శ్నించారు. హైద‌రాబాద్‌లో ఏపీ మంత్రుల‌కు సంబంధించిన కంపెనీల‌కు అనుమ‌తులు ఎలా వ‌చ్చాయని ప్రశ్నించారు. స్థానిక ప‌రిస్థితుల‌ను బ‌ట్టి త‌మ‌కు ఇష్టం వ‌చ్చిన పార్టీతో పొత్తులు పెట్టుకునే అధికారాన్ని చంద్ర‌బాబు త‌మ‌కు ఇవ్వాలని వ్యాఖ్యానించారు.

మొత్తానికి.. రేవంత్ రెడ్డి దూకుడు చూస్తుంటే.. ఆయన కాంగ్రెస్ లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.

Related posts:

loading...