‘రాజా..దీపావళికి ‘ కష్టమేనా..?

మాస్ మహారాజ్ రవితేజ రెండేళ్ల గ్యాప్ తర్వాత రాజా ది గ్రేట్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. పటాస్ ఫేమ్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించడం , దిల్ రాజు నిర్మాత కావడం తో ఈ సినిమా ఫై భారీగానే అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ సైతం బాగా నచ్చడం తో ఈ మూవీ గ్యారెంటీ గా హిట్ అవుతుందని అంత నమ్మకం పెట్టుకున్నారు. అయితే ఈ మూవీ దీపావళి కానుకగా ఈ నెల 19 న రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించినప్పటికీ , ప్రస్తుతం ఈ మూవీ దీపావళి కి రావడం కష్టమే అనే వార్త ఫిలిం సర్కిల్లో చక్కర్లు కొడుతుంది.

ఎందుకంటే ఈ సినిమా షూటింగ్ ఇంకా ఓ కొలిక్కి రాలేదట, సినిమాకి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాల్లో ప్యాచ్ వర్క్ ఇంకా మిగిలి ఉండడం తో పాటు రవితేజ ..మెహరీన్ ల ఫై కొన్ని సీన్లు చేయాల్సి ఉందట. ప్రస్తుతం మెహరిన్ ఈ సినిమాకు సంబంధించిన షూట్ లోనే పాల్గొంటుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఈ సినిమా అనుకున్న తేదీకే విడుదల అవ్వుతుందా లేక మరో వారం వాయిదా పడే అవకాశం ఉందా అనే సందేహాలు బయటకు వస్తున్నాయి.

Related posts:

loading...