రాజమౌళిపై రామ్ గోపాల్ వర్మ సెటైర్..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు .. అమరావతిలో చేపట్టబోయే నిర్మాణాలపై దర్శకుడు రాజమౌళి సలహాలు కోరిన సంగతి తెలిసిందే. రాజమౌళి నుంచి సూచనలు తీసుకోవాలని సీఆర్డీఏ అధికారులకు సూచించిన చంద్రబాబు.. ఆయనతో ఒకసారి భేటి కూడా అయ్యారు.

అయితే ఈ విషయంలో కొన్ని విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఇలాంటి వ్యంగ్యాస్త్రమే సంధించాడు దర్శకుడు వర్మ. కోట్ల రూపాయలు ఖర్చు చేసి అసెంబ్లీని నిర్మించడం దండగ. ఏపీ ప్రభుత్వానికి ఒక గొప్ప సలహాను ఇస్తున్నా. అసెంబ్లీ సమావేశాలను గ్రీన్ మ్యాట్ తెర ముందు నిర్వహించి, ఆ తర్వాత రాజమౌళి సహకారంతో గ్రాఫిక్స్ జతచేసి టెలికాస్ట్ చేస్తే అద్భుతంగా ఉంటుంది. ఇలా చేస్తే మన అసెంబ్లీ ప్రపంచంలోని అన్ని అసెంబ్లీల కన్నా గొప్పగా ఉంటుంది. ఎందుకంటే అది ‘బాహుబలియన్ అసెంబ్లీ”’ అంటూ ఓ సెటైర్ వేశాడు వర్మ. మరి దీనిపై ఎలాంటి రియాక్షన్ వస్తాయో చూడాలి.

Related posts:

loading...