నాగ్- నాని సినిమా.. మెగా బ్యానర్ లో !

వరుస హిట్లతో ఊపు మీద ఉన్నాడు నాని.. విలక్షణ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు మన్మథుడు నాగార్జున. వీరిద్దరూ కలసి ఒక సినిమా చేయబోతున్నారు శమంతకమణి సినిమాతో మల్టీస్టారర్ మూవీ హ్యాండిల్ చేయడంలో బెస్ట్ అనిపించుకున్నాడు దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య. ఇప్పుడీ మల్టీస్టారర్ ను డైరెక్ట్ చేయబోతున్నాడు.

ఐతే ఇప్పుడీ చిత్రాన్ని తెర‌కెక్కించే నిర్మాత ఎవ‌ర‌న్నది తెలిసిపోయింది. ఈ సినిమా వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్‌లో ఉండొచ్చని తెలుస్తుంది. మెగా బ్యానర్ గా వెలుగొందిన అశ్వనీద‌త్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించే అవ‌కాశాలున్నాయి. నాగార్జున- అశ్వ‌నీదత్‌ కలయికలో చాలా సినిమాలు వచ్చాయి. ‘గోవిందా గోవిందా’, ‘రావోయి చంద‌మామ’, ‘ఆజాద్’ లాంటి చిత్రాలు ఈ బ్యాన‌ర్ లో వచ్చినవే. ఇప్పుడు చాలా రోజుల తర్వాత మరో సినిమా రానుంది వీరి కలయికలో.

Related posts:

loading...