అవ్వకు ఇల్లు కట్టించిన కేటీఆర్‌

ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలు తెలుసుకొని తక్షణం వారి సమస్యలను తీరుస్తూ ప్రజల్లో గొప్ప నాయకుడి గా ముద్ర వేసుకున్న తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ , తాజాగా నిరాశ్రయురాలైన ఓ అవ్వకు ఆశ్రయం కల్పించి తన గొప్ప మనసును చాటుకున్నాడు.

2017 ఫిబ్రవరి 23న తంగళ్లపల్లి మండలం రాంచంద్రాపూర్‌లో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి కేటీఆర్‌ను , అదే గ్రామానికి చెందిన మేడిపెల్లి నీలవ్వ తమకు నిలువ నీడలేదని మంత్రికి విన్నవించింది. మగ పిల్లలందరూ చనిపోయారనీ, కూతురు వసంతతో కలిసి దయనీయ పరిస్థితుల్లో ఉన్నానని తన బాధను మంత్రికి చెప్పుకొంది.

దీనికి చలించిన మంత్రి కేటీఆర్ వెంటనే రూ.22 వేల ఆర్థిక సాయంతోపాటు సొంతంగా ఇల్లు కట్టిస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ ఇల్లు పూర్తయ్యింది. ఈ మేరకు శనివారం మంత్రి కేటీఆర్ సిరిసిల్లలో పర్యటించనుండగా మొదట తంగళ్లపల్లి మండలం రాంచంద్రాపూర్‌లో తాను కట్టించిన ఇంట్లో ఉంటున్న నీలవ్వను కలవబోతున్నారు.

Related posts:

loading...