కళ్యాణ్ రామ్ ఎక్కడ తగ్గడం లేదు..

జై లవకుశ మూవీ తో సూపర్ హిట్ కొట్టిన నిర్మాత కళ్యాణ్ రామ్ , హీరోగా జెట్ స్పీడ్ తో సినిమాలు పూర్తి చేస్తున్నాడు. ఒకేసారి రెండు సినిమాలను సెట్స్ ఫైకి తీసుకొచ్చి వాటిని పూర్తి చేసేందుకు తెగ కష్టపడుతున్నాడు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్, కూల్ బ్రయీజీ సినిమాస్ సంయుక్తంగా తమిళ డైరెక్టర్ జయేంద్ర డైరెక్ట్ చేస్తున్న చిత్రం ఇప్పటికే 40 శాతం పూర్తి అయినట్లు తెలుస్తుంది. ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. మొదలు పెట్టిన అతి కొద్దీ టైంలోనే ఈ చిత్రం ఇంత వేగంగా షూటింగ్ జరుపుకొంటుండటం విశేషమని అందరూ చెపుతున్నారు.

ప్రముఖ సినిమాటోగ్రఫర్ పి.సి. శ్రీరామ్ కెమెరా వర్క్ చేస్తున్న ఈ చిత్రానికి శరత్ సంగీతాన్ని అందిస్తున్నారు. కిరణ్ ముప్పవరపు, విజయ్ కుమార్ వట్టికూటి లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇకపోతే కళ్యాణ్ రామ్ ఈ చిత్రంతో పాటే నూతన దర్శకుడు ఉపేంద్ర మాదవన్ దర్శకత్వంలో ‘మంచి లక్షణాలున్న అబ్బాయి’ అనే సినిమా కూడా పూర్తి చేసే పనిలో ఉన్నాడు. కాజల్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తుంది.

Related posts:

loading...