హన్సిక కావాలని అంటున్న దర్శకుడు.. వద్దే వద్దంటున్న నిర్మాత!

శ్రుతి హాసన్ తప్పుకోవడంతో ‘సంఘమిత్ర’ సినిమా పరిస్థితి అటూ ఇటూ కాకుండా తయారైంది. భారీ బడ్జెట్ తో ఆ సినిమాను రూపొందిస్తామని ప్రకటించారు. రెండు వందల కోట్ల రూపాయలు పెడతామని అంటున్నారు. శ్రుతిహాసన్ అయ్యుంటే ఆ సినిమాను తమిళ, తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేయడానికి అవకాశం ఉండేది. అయితే శ్రుతి హాసన్ కు ప్రత్యామ్నాయం మాత్రం దొరకలేదు.

ఈ క్రమంలో నయనతార, అనుష్క వంటి వాళ్లను తీసుకోవాలని ప్రయత్నాలు చేసినా.. అవేవీ ఫలించలేదు. ఇంతలోనే ఆ సినిమా దర్శకుడు సుందర్.సి ఒక ప్రతిపాదన తెచ్చాడట.. సంఘమిత్రను హన్సికతో పూర్తి చేద్దామని ఆ దర్శకుడు అంటున్నాడట. సుందర్.సి, హన్సికల గురించి వేరే చెప్పనక్కర్లేదు. సుందర్ తీసిన పలు సినిమాల్లో హన్సిక హీరోయిన్ గా నటించింది. ఆమెకు వరసగా అవకాశాలు ఇచ్చాడు ఈ దర్శకుడు.

మరి ఇప్పుడు సంఘమిత్రను కూడా హన్సికను పెట్టి పూర్తి చేసేద్దామని ఈ దర్శకుడు స్కెచ్ వేశాడట. తన అభిమాన హీరోయిన్ సంఘమిత్ర ద్వారా మరో అవకాశం ఇద్దామని అనుకుంటున్నాడట. అయితే ప్రస్తుతం హన్సిక పరిస్థితి గురించి వేరే వివరించనక్కర్లేదు. తెలుగు, తమిళ భాషల్లో ఈమెను పట్టించుకునే నాథుడు ఎవరు లేరు. ఈ విషయం సంఘమిత్ర నిర్మాతకు కూడా అర్థమైంది. దీంతో సుందర్.సి స్కెచ్ కు అడ్డుపుల్ల వేశాడట ఆ నిర్మాత. హన్సిక మీద రెండు వందల కోట్ల రూపాయలు పెట్టడం ఏ మాత్రం సేఫ్ బెట్ కాదని గ్రహించి.. ఆమె వద్దు అని స్పష్టం చేసినట్టు సమాచారం. దీంతో సంఘమిత్ర కోసం నటీమణి వేట కొనసాగుతోంది.

Related posts:

loading...