అప్పు కోసం దిల్ రాజు వేట..

టాలీవుడ్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ అంటే ఎవరైనా దిల్ రాజు పేరే చెపుతారు..అలాంటి దిల్ రాజు కు అప్పు కావాలట..అదేంటి అనుకుంటున్నారా..అవును ఇది నిజమే మాములుగా దిల్ రాజు సినిమా అంటే మినిమమ్ బడ్జెట్ లోనే తెరకెక్కిస్తారు. కానీ ఈసారి మాత్రం దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ తో మూవీ ని తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించాడు. ఇంతకీ ఏ సినిమా అనే కదా సందేహం. అదే భారతీయుడు 2.

స్టార్ డైరెక్టర్ శంకర్ తో ఈ సినిమాను తెలుగు , తమిళం లో తెరకెక్కిస్తున్నట్లు దిల్ రాజు ప్రకటించాడు. జస్ట్ స్టోరీ లైన్ విని ఈ కథకు 200 కోట్లు కేటాయించాడట రాజు. సినిమా అంత సిద్ధం అయ్యాక , సెట్స్ పైకి వచ్చాక శంకర్ మరో 200 కోట్లు యాడ్ చేస్తాడు అనుకోండి. ప్రస్తుతానికి మాత్రం 200 కోట్లతో సినిమా మొదలు పెట్టాలని దిల్ రాజు ప్లాన్ చేసాడట.

అందుకే అప్పు కోసం ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు ఫిలిం సర్కిల్లో వార్తలు వినిపిస్తున్నాయి. దిల్ రాజు అప్పు అంటే ఎవరు కాదంటారు చెప్పండి. ఇండస్ట్రీ లో టాప్ ప్రొడ్యూసర్ గా దిల్ రాజు కు పేరు ఉండడం తో రాజు అడగలే కానీ 1000 కోట్లు ఇవ్వడానికి కూడా ఫైనాన్సియర్లు లైన్ లో ఉన్నారు.

Related posts:

loading...