హైదరాబాద్ చేరిన జియో ఫోన్లు

గుడ్ న్యూస్. జియో ఫీచర్ ఫోన్లు హైదరాబాద్ చేరాయి. మరికొద్ది గంటల్లో ఆ ఫోన్లు వినియోగదారుని చేతికి చేరనున్నాయి. ఆన్ లైన్ లో జియో ఫీచర్ ఫోన్లని బుక్ చేసుకొని వాటి కోసం ఎదురు చూస్తున్న హైదరాబాద్ వినియోగదారులు ఈరోజు వాటిని అందుకోనున్నారు. ఇప్పటికే ఈ ఫోన్లు హైదరాబాదులోని కవాడిగూడలో డెలివరీ అయ్యాయి. ప్రీబుకింగ్ సమయంలో రూ. 500 చెల్లించిన వినియోగదారులు.. మిగిలిన రూ. 1000 కూడా చెల్లించి జియో ఫోన్లని పొందవచ్చు.

హైదరాబాద్ కంటే ముందే జియో ఫోన్ల డిలవరీ పల్లెలో జరిగిపోయిందని జియో ప్రతినిధులు చెబుతున్నారు. నవరాత్రుల సందర్భంగా పల్లె ప్రజలకు ముందుగా ఫోన్లను అందించాలనే ఉద్దేశంతోనే, పల్లెల్లో ఫోన్లను డెలివరీ చేశారు. జియో దెబ్బకు ఎయిర్ టెల్, ఐడీయా లాంటి టెలికాం సంస్థలు స్పెషల్ ఆఫర్లని ప్రకటించిన విషయం తెలిసిందే. అయినా.. జియో పోటీని ఆయా కంపెనీలు తట్టుకోలేకపోతున్నాయి.

Related posts:

loading...