సామ్ తో ధోని టైంపాస్..

ధోని కి పెట్ డాగ్స్ అంటే చాలా ఇష్టం. సమయం దొరికితే చాలు .. తన పెంపుడు టామీలాతోనే టైం పాస్. ధోని కి ఫేవరేట్ పెట్ సామ్ వుంది. ఇది వరకు ఓసారి సామ్‌కు క్యాచ్‌లు పట్టడం నేర్పిస్తున్న వీడియోను సోషల్‌మీడియా లో వైరల్ అయ్యింది.

తాజాగా మరోసారి సామ్ తో ఆడుకొని కనిపించాడు ధోని. ధోనీ భార్య సాక్షి.. సామ్‌తో ధోనీ ఆడుకుంటున్న వీడియోను ఇన్‌స్టాగ్రాం ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ వీడియోలో ధోనీ ఎటు కదిలితే అటు సామ్‌ కూడా కదులుతూ అతన్నే అనుసరిస్తోంది. చివర్లో ధోనీ.. సామ్‌ను దగ్గరకు తీసుకుని ప్రేమగా పట్టుకోవడం ఆకట్టుకుంది.

ఆస్ట్రేలియాతో వన్డే, టీ20 సిరీస్‌లకు మధ్య దొరికి కాస్త బ్రేక్‌లో టీమిండియా ప్లేయర్స్ ఎంజాయ్ చేస్తున్నారు. మూడు రోజుల పాటు ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లిపోయారు. క్రికెట్ నుంచి కాస్త పక్కకు జరిగి రిలాక్స్ అవుతున్నారు. ధోనీ కూడా తన సొంతూరు రాంచీలో వున్నాడు.

#belgiummalinois #sam ‘s mirroring talent ! 🤣🤣🤣 @mahi7781

A post shared by Sakshi (@sakshisingh_r) on

Related posts:

loading...