వర్మ, బ్రదర్ అనిల్ భేటీ.. వెనక !

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మతో వైఎస్ జగన్ బావ బ్రదర్ అనిల్‌ సుధీర్ఘ భేటీ చర్చనీయాంశమైంది. వీరిద్దరు హైదరాబాద్‌లోని పార్కు హయత్ హోటల్‌లో సమావేశమయ్యారు. దాదాపు దాదాపు గంటన్నరపాటు వీరి మధ్య చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. వీరి భేటీకి సంబంధించి ఫోటోలు కూడా టీవీ సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా తీస్తానని ప్రకటించిన నేపథ్యంలో.. ఆయనపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో జరిగిన వర్మ, బ్రదర్ అనిల్ ల భేటీ పరిస్తితిని మరింత హీటెక్కించేలా ఉంది. అయితే, వీరి భేటీలో లక్ష్మీస్ ఎన్టీఆర్ ఏ కోణంలో తీద్దామన్న విషయంపై చర్చించినట్టు తెలుస్తోంది. ఈ సినిమా వైసీపీకి ఎన్నికల్లో మైలేజీ ఇచ్చేలా ప్లాన్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. వర్మ మాత్రం తమ భేటీకి ప్రత్యేక కారణం లేదని చెప్పారు. బ్రదర్ అనిల్ మాత్రం ఏసు ప్రభు జీవిత చరిత్రపై చర్చించామని తెలిపారు.

మొత్తానికి వర్మ, బ్రదర్ అనిల్ ల భేటీ ఏపీ రాజకీయాలని మరింత హీటెక్కించేలా కనబడుతోంది.

Related posts:

loading...