వచ్చే వారానికి ‘అదిరింది’..

విజయ్, ఎస్.జె.సూర్య, కాజల్ అగర్వాల్, సమంతా, నిత్యామీనన్ జంటగా అట్లీ దర్శకత్వం లో తమిళంలో తెరకెక్కిన చిత్రం మెర్సాల్..దీపావళి కానుకగా నిన్న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయి డివైడ్ టాక్ సొంతం చేసుకుంది. కాగా ఈ చిత్రాన్ని అదిరింది పేరుతో తెలుగు లో కూడా నిన్ననే రిలీజ్ చేయాలనీ చిత్ర నిర్మాత శరత్ మరార్ ప్లాన్ చేసారు. కానీ సెన్సార్ కార్య క్రమాలు ఆలస్యం కావడం తో ఈ మూవీ ని వచ్చే వారానికి వాయిదా వేసినట్లు తెలుస్తుంది.

వాస్తవానికి తెలుగు లో విజయ్ చిత్రాలకు పెద్దగా ఆసక్తి చూపించారు మన తెలుగు ప్రేక్షకులు..అలాంటిది తమిళనాట యావరేజ్ అనిపించుకున్న మూవీ ని మన ఆడియన్స్ ఎలా చేస్తారనేది కాస్త సందేహం గా మారింది. మరి విజయ్ కి అదిరింది ఏ మేరకు విజయం అందిస్తుందో చూడాలి.. ప్రపంచం గర్వించదగ్గ చిత్రం బాహుబలి, సల్మాన్ ఖాన్ కు భారీ హిట్ అందించిన భజరంగీ భాయిజాన్ వంటి చిత్రాలకు కథ అందించిన విజయేంద్రప్రసాద్ అదిరింది చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే అందించడం విశేషం. ఈ చిత్రంలో విజయ్ తో పాటు ఎస్.జె.సూర్య, కాజల్ అగర్వాల్, సమంతా, నిత్యామీనన్, వడివేలు, కోవై సరళ, సత్యన్ మరియు సత్యరాజ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇండియాలోని పలు ప్రాంతాలతో పాటు యూరప్ లోని అందమైన లొకేషన్స్ లో ఈచిత్ర షూటింగ్ జరిగింది.

Related posts:

loading...