రాజు గారి గది 2 ఆలస్యానికి అదే కారణమట..

రాజుగారిగది సూపర్ హిట్ కావడం తో దానికి సీక్వెల్ గా రాజు గారి గది 2 తెరకెక్కిస్తున్నాడు. నాగార్జున కు జంటగా సీరత్ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండడం , సమంత ఓ ముఖ్య రోల్ చేస్తుండడం తో సినిమాకు మరింత హైప్ వచ్చింది. ఎప్పుడు షూటింగ్ మొదలు పెట్టారు కానీ మధ్య మధ్య లో కొన్ని అనుకోని కారణాలతో రిలీజ్ కు బ్రేక్ పడింది.. లేకపోతే ఆగస్టు లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండే..ప్రస్తుతం అక్టోబర్ లో సినిమా రిలీజ్ అంటున్నారు.

తాజా సమాచారం ప్రకారం గ్రాఫిక్ వర్క్ లో జాప్యం వల్లనే సినిమా ఆలస్యం అవుతుందని అంటున్నారు. నిజానికి రాజుగారి గది-2 షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. నాగ్ నిర్మించిన రారండోయ్ వేడుక చూద్దాం సినిమా రిలీజ్ కాకముందే రాజుగారి గది-2 పూర్తయింది. కాకపోతే రీ షూట్స్ కారణంగా మొన్నటివరకు డిలే అయింది. ఇప్పుడు గ్రాఫిక్స్ మూలంగా సినిమా విడుదల పోస్ట్ పోన్ అయినట్టు తెలుస్తోంది. లేట్ అయినాగానీ సినిమా బాగా వస్తుందని అంటున్నారు చిత్ర యూనిట్.

Related posts:

loading...