భువి.. ప్రేయసిని చూపించాడు !

టీమిండియా స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ సిగ్గు ఎక్కువని చెబుతుంటారు. ఈ సిగ్గరి ఓ సీక్రెట్ చెబుతానని ఐదార్నెళ్ల క్రిందట అభిమానులని ఊరించాడు. అయితే, ఇంతవరకు చెప్పనే లేదు. అయినా.. అభిమానులు పట్టువద్దల్లేదు. మీరు సీక్రెట్ చెప్పనే లేదు భువి అంటూ ప్రశ్నలు అడగడం మొదలెట్టారు. ఇక, అభిమానులని నిరాశపరచడం మంచిది కాదని భువి భావించినట్టున్నాడు.

ఆ సీక్రెట్ ని రిలీవ్ చేసేశాడు. ఆ ఫోటోలో ఉన్నది తన ‘బెటర్ హాఫ్’ అంటూ, ఆమె పేరు నుపుర్ నాగర్ అని వెల్లడించాడు. ఇప్పుడీ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భువి ప్రేయసి నపుర్ నాగర్ పేరు మారుమ్రోగిపోతుంది. ప్రేయసిని అభిమానులకి పరిచయం చేసిన భువీ.. పెళ్లెప్పుడు ? అనేది మాత్రం చెప్పలేదు.

ప్రస్తుతం కెరీర్ పీక్స్ లో ఉన్న భువీ ఇప్పట్లో పెళ్లి చేసుకొనే ఆలోచన చేయడం లేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మరో రెండేళ్ల తర్వాత పెళ్లి ఆలోచన చేస్తాడట. అప్పటి వరకు ప్రేమలో మునిగితేలడమే.. !

Related posts:

loading...