పంతులమ్మగా సమంత..

నాగార్జున లేటెస్ట్ చిత్రం ‘రాజుగారి గది-2’.సమంత, సీరత్ కపూర్ హీరోయిన్స్. ఓంకార్ దర్శకుడు. ఈ నెల 13వ తేదీన ఈ సినిమా భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుండి ఓ కొత్త పోస్టర్ వదిలారు. సమంత లుక్ ఇది.

ఈ లుక్ లో సమంత పంతులమ్మగా కనిపించింది. తెల్ల పంచె, లాల్చీలో ఆమె ఉన్న ఈ ఫొటో అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. గతంలో సమంత, రావు రమేశ్‌ పంచెకట్టులో ఉన్న ఫొటో ఒకటి వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. సమంత ఈ లుక్‌లో ఏ సినిమాలో కనిపిస్తారు? అనే చర్చ జరిగిందిఈ లుక్ తో దానిపై క్లారిటీ వచ్చేసింది.

కాగా ఈ సినిమా సెన్సారు కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమా, యు/ఎ సర్టిఫికేట్ ను సంపాదించుకుంది ‘రాజుగారి గది మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే టైటిల్ లో ఓ మలయాళం సినిమా రిమేక్ రైట్స్ ను కొనుక్కుని దానికి చాలా మార్పులు చేసి ‘రాజుగారి గది 2’ తీశారు.

Related posts:

loading...