ధోని నిద్ర.. మళ్ళీ వైరల్

మహేంద్ర సింగ్‌ ధోని మిస్టర్ కూల్. దేశం గర్వంచదగ్గ విజయాల్ని అదించినా ఆయనలో ఆ గర్వం ఇసుమంతైన కనిపించదు. రాంచీలో గల్లీ క్రికెటర్ గా ఎలా వుండేవాడు ఇప్పుడు అంతే . ఎలాంటి మార్పు లేదు. పరిస్థితి ఎలా వున్నా కూల్ గా వుండటం ఆయన స్టయిల్ మొన్న ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్‌-శ్రీలంకల మధ్య మూడో వన్డేలో జరిగిన విషయం తెలిసిందే.

ఈ మ్యాచ్ లో లంక అభిమానుల గొడవ వల్ల అంపైర్లు మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే ఈ బ్రేక్ సమయంలో ధోని హెల్మెట్‌, గ్లౌజులు తొలగించి క్రీజులో బోర్లా పడుకుని విశ్రాంతి తీసుకున్నాడు.

ఇప్పడు అదే స్టయిల్ లో ఎయిర్‌పోర్టులో ప‌డుకున్నాడు. నిన్న చెన్నైలో ఆస్ట్రేలియాతో మొద‌టి వ‌న్డే ఆడిన‌ టీమిండియా అద్భుత విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. రెండో వన్డే కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జ‌ర‌గ‌నుంది. కోల్‌క‌తాకి వెళ్లే క్రమంలో చెన్నై ఎయిర్‌పోర్టుకి టీమిండియా ఆట‌గాళ్లంతా వ‌చ్చారు. విమానం కాస్త ఆలస్యమైయింది. దీంతో టీమిండియా మిగ‌తా ఆట‌గాళ్లంతా ఫ్లోరుపై కూర్చుంటే ధోనీ మాత్రం చక్కగా ఓ కునుకేశాడు. ఇప్పుడీ ఫోటో తెగ వైరల్ అవుతుంది.

Related posts:

loading...