జేబులో పేలిన శాంసంగ్‌ ఫోన్..

ఈ మధ్య స్మార్ట్ ఫోన్లు పేలడం చాల కామన్ అయిపొయింది..మాములు ఫోన్లే కాక అగ్ర సంస్థల ఫోన్లు సైతం పేలుతుండడం కస్టమర్లను ఖంగారు పెడుతున్నాయి. తాజాగా శాంసంగ్‌కు చెందిన 2013 గ్రాండ్ డ్యుయోస్ మోడల్ ఫోన్ జేబులో పేలిన ఘటన ఇండోనేషియాలో చోటు చేసుకుంది.

యులియాంటో అనే వ్యక్తి నిల్చుని ఉండగా అతడి షర్టు జేబులో ఉన్న శాంసంగ్ ఫోన్ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో అతడు వెంటనే కిందపడ్డాడు. ఇది గమనించిన మరో వ్యక్తి వచ్చి మంటలు అంటుకున్న చొక్కాను విప్పడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై స్పందించిన శాంసంగ్.. ఆ పేలిన ఫోన్‌లో ఉన్నది శాంసంగ్ తయారు చేసిన బ్యాటరీ కాదని వివరణ ఇచ్చింది. వేరే బ్యాటరీ వాడడం వల్లే ఫోన్ పేలినట్టు తెలిపింది.

Related posts:

loading...