జవాన్ గా మారిన మోడీ

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ఈ రోజు సైనికుల‌తో క‌లిసి దీపావ‌ళి పండుగ‌ను జ‌రుపుకున్నారు. జ‌మ్ముక‌శ్మీర్‌లోని గురేజ్ వ్యాలీకి చేరుకున్న ఆయ‌న సైనికుల‌కు మిఠాయిలు అందించారు. దాదాపు రెండు గంట‌ల‌పాటు సైనికుల‌తో ముచ్చ‌టించారు.

అత్యంత కఠినమైన పరిస్థితుల్లో కూడా సైనికులకున్న అంకితభావాన్ని, త్యాగాన్ని ఆయన కొనియాడారు. అందరిలాగానే తనకు కూడా కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి జరుపుకోవాలని అనిపించిందనీ.. అందుకే తాను సైన్యంలోని జవానుల మధ్యకు వచ్చానని అన్నారు.

జవాన్లు ప్రతి రోజు యోగ చేయడం తనకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందని, ఎంతో పరాక్రమం, శౌర్యంతో మన దేశాన్ని జవాన్లు కాపాడుతారని… దేశాన్ని కాపాడటం కోసం తమను తాము త్యాగం చేసుకుంటూ ఎంతో అంకితభావంతో పని చేస్తారని ఈ సందర్భంగా కొనియాడారు మోడీ.

Related posts:

loading...