జగన్’కు మినహాయింపు లభించేనా ?

నవంబర్ 2వ తేదీ నుంచి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేపట్టనున్న విషయం తెలిసిందే. అనంతపురం జిల్లా నుంచి జగన్ పాదయాత్ర ప్రారంభం కానుంది. ఈ పాదయాత్రలో ఏపీకి ప్రత్యేక హోదా, టీడీపీ ఎన్నికల హామీలని ప్రధానం ప్రస్తావించేందుకు జగన్ రెడీ అయినట్టు తెలుస్తోంది. అయితే, పాదయాత్రకు వెళ్లేముందే కోర్టు హాజరుకావాలన్న టెన్షన్ ని ప్రక్కన పెట్టేందుకు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.

సీబీఐ కోర్టులో జగన్ ఓ పిటిషన్ ని దాఖలు చేశారు. అక్ర‌మాస్తుల కేసు విచారణ నేప‌థ్యంలో ప్రతి శుక్రవారం నాడు జ‌గ‌న్ కోర్టుకు హాజరుకావాలి. అయితే, పాదయాత్ర నేపథ్యంలో కోర్టుకు హాజరుకావడం వీలుకాదు. రాష్ట్ర‌ ప్రతిపక్ష నేతగా ప్రజల‌ సమస్యలపై స్పందించాల్సిన బాధ్యత తనపై ఉందని, కాబట్టి కోర్టు హాజరు నుంచి తనకు ఆరు నెలల పాటు మినహాయింపు ఇవ్వాలని అభ్యర్థించారు.

జ‌గ‌న్ వేసిన‌ ఈ పిటిషన్‌పై విచారణ ఈ నెల 13న‌ జరుగుతుంది. ఈ పిటిషన్ పై కోర్టు తీర్పు ఏవిధంగా వస్తుందనేది ఆసక్తిగా మారింది.

Related posts:

loading...