గ్రూప్ రాజకీయాలపై బాలయ్య కామెంట్

గ్రూపు రాజకీయాలకు భయపడేది లేదని అన్నారు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అనంతపురం జిల్లాలోని తన నియోజకవర్గమైన హిందూపురంలో పర్యటిస్తున్నారు బాలకృష్ణ. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. కృష్ణా జిల్లాలోని గుడివాడ, మైలవరం నియోజకవర్గాల నుంచి తాను పోటీ చేస్తానని వస్తున్న వార్తలు ఊహాగానాలేనని కొట్టిపారేశారు.

వచ్చే ఎన్నికల్లో తాను గుడివాడ, మైలవరం నుంచి పోటీ చేస్తారన్న వార్తలు వూహాజనితమని.. హిందూపురం నుంచే తాను పోటీ చేస్తానని స్పష్టం చేశారు. అల్లాగే హిందూపురం పట్టణానికి రూ.198కోట్లతో హంద్రీనీవా నుంచి పైపులైన్లు వేసి ఐదు నెలల్లోగా నీరు అందిస్తామని వెల్లడించారు.

Related posts:

loading...