గుడ్ న్యూస్ : పెట్రో ధరలు తగ్గాయి

వాహనదారులకి గుడ్ న్యూస్. పెట్రోల్‌, డీజిల్‌పై రూ.2 మేర ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో లీట‌ర్ పెట్రోల్ , డీజిల్ పై రూ. 2 చొప్పున త‌గ్గ‌నుంది. తగ్గిన ధరలు ఈరోజు అర్థరాత్రి నుంచి అమలులోనికి రానున్నాయి. కేంద్రం తాజా చర్యలతో.. రోజువారీ ధరల సమీక్ష విధానం తర్వాత భారీగా పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరల నుంచి వినియోగదారులకు వూరట లభించినట్టయ్యింది.

ఇటీవల ధరలు పెరుగుతున్నా ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించకపోవడంతో కేంద్రంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ప్రభుత్వ ఆదాయానికి ఏడాదికి రూ.26వేల కోట్లు గండిపడనుంది. కాగా, జులై 4 తర్వాత పెట్రోల్‌ ధర రూ.7.8 పెరగ్గా, డీజిల్‌ ధర రూ.5.7 మేర పెరిగిన విషయం తెలిసిందే.

Related posts:

loading...