కాంగ్రెస్ లోకి రేవంత్.. వాస్తవం ఇదే

తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకుడు రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు వార్తలు వచ్చాయి ప్రస్తుతం ఆయన దిల్లీలో ఉన్నారు. కాంగ్రెస్‌ నేతలతో సమావేశమయ్యేందుకే రేవంత్‌రెడ్డి దేశ రాజధాని వెళ్లినట్లు వూహాగానాలు వినిపించాయి . మంగళవారం సాయంత్రం కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీతో రేవంత్‌రెడ్డి భేటీ అయినట్లు విస్తృత ప్రచారం జరిగింది. రాహుల్‌గాంధీ ఏఐసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టకముందే రేవంత్‌ను కాంగ్రెస్‌లోకి చేర్చుకునేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు ఓ కధనం వినిపించింది.

అయితే తాను కాంగ్రెస్‌లోకి వెళ్తున్నట్లు వస్తున్న వార్తలన్నీ వదంతులేనని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి. తానెవరినీ కలవలేదని,టీఆర్ఎస్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా తెలంగాణ మంత్రులు ‘బంగారు కూలీ’ పేరుతో లక్షలాది రూపాయలను చందాలుగా వసూలు చేయడంపై దిల్లీ హైకోర్టులో కేసు వేయడానికే వచ్చినట్లు స్పష్టం చేశారు. తాను పార్టీ మారుతున్నట్లు వచ్చిన వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని చెప్పారు రేవంత్ రెడ్డి.

Related posts:

loading...