ఎయిర్‌టెల్ మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది

ప్రస్తుతం టెలికం రంగం లో జియో అలజడి మాములుగా లేదు..జియో దెబ్బతో మిగతా సంస్థలకు నిద్ర లేకుండా చేస్తున్న సంగతి తెల్సిందే. జియో తాకిడిని తట్టుకునేందుకు ఎంత చేయాలో అంత చేస్తున్నారు.. వీరిలో ముందు వరుస లో ఎయిర్ టెల్ సంస్థ ఉంది. ఎప్పటికప్పుడు సరికొత్త ఆఫర్స్ తో జియో కు గట్టి పోటీ ఇస్తూ వస్తుంది. ఈ నేపథ్యం లో తాజాగా రూ.799 ప్లాన్‌ను ప్రకటించింది.

దీని కింద రోజుకు 3 జీబీ డేటాతోపాటు అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ కాల్స్ ఇస్తున్నది. అయితే కేవలం ప్రీపెయిడ్ యూజర్లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఇలాంటిదే జియో కూడా 799 ప్లాన్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఎయిర్‌టెల్ పేమెంట్స బ్యాంక్ నుంచి కొత్త ప్లాన్‌ను కొనుగోలు చేస్తే.. రూ.75 క్యాష్‌బ్యాక్ ఇస్తున్నది. కొత్త ప్లాన్స్ రూ.549 నుంచి రూ.999 మధ్య ఉన్నాయి. ఇవి రోజుకు 2 జీబీ నుంచి 4 జీబీ డేటా వాడుకొనే అవకాశాన్ని కల్పిస్తున్నాయి.

Related posts:

loading...