ఎఫైర్: కత్రినా రణబీర్ తో ఎందుకు విడిపోయిందొ తెలుసా..?

బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్.. మాంచి ప్రేమ కధలు నడిపాడు. స్టార్ భామలతో ప్రేమయాణాలు సాగించాడు. మొదట దీపికా పదుకొనే.. ఆ తర్వాత కత్రినా కైఫ్ వంటి అందాల భామలతో లవ్ స్టోరీలు వున్నాయి రణబీర్ కు. అయితే ఇందులో కత్రినా కైఫ్ తో చాలా డీప్ గా వెళ్ళాడు. ఇద్దరూ ముంబాయిలో చాలా కాలం సహజీవనం చేశారు. లవ్ నెస్ట్ అంటూ ఓ ఇల్లు కూడా కొనుకున్నారు. అయితే చాలా షాకింగ్ ఈ ఇద్దరూ విడిపోయారు. దీనికి కారణం రణబీర్ కపూర్ సాగించిన మరో ఎఫైర్ అని అప్పట్లో వినిపించింది. ఆల్రెడీ పెళ్లయిన ఒక అమ్మాయితో రన్ బీర్ సరసం సాగించాడని, ఇది కత్రినాకి తెలిసి మనసు మార్చుకుందని, ఆమె మోజులో రన్ బీర్ కూడా కత్రినాను లైట్ తీసుకున్నాడని చెప్పుకున్నారు.

అయితే ఆ వివాహిత ఎవరో ఇప్పుడు తెలిసింది. ఆమె పాకిస్తానీ హీరోయిన్ మహిరాఖాన్. షారూక్ ఖాన్ రయీస్ మూవీతో ఇండియన్ ఆడియన్స్ కు చేరువైన మహిరా ఖాన్.. రణబీర్ తో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతోందని ఇప్పుడు ఓపెన్ సీక్రెట్. వీళ్ల లవ్ స్టోరీని కన్ఫాం చేసే సాక్ష్యం దొరికింది. ఈ మహిరాఖాన్- రణబీర్ కపూర్ లు న్యూయార్క్ లో చక్కర్లు కొడుతూ ఫోటోలకు చిక్కారు. ఇద్దరూ కలిసి తెగ పొగ లాగించేస్తున్నారు ఈ ఫోటోలో. ఆల్రెడీ పెళ్లి చేసుకొని ఓ బిడ్డకు తల్లి అయిన మహిరాఖాన్.. భర్తతో విడాకులు తీసుకొని.. ఇప్పుడు రన్ బీర్ తో సహజీవనంలో వుందని ఈ ఫోటోలు సాక్ష్యంగా నిలిచాయి.

Related posts:

loading...