ఈ ట్రాక్టర్ కు డ్రైవర్ అవసరం లేదు..

వ్యవసాయ రంగానికి ఉపయోగపడే సరికొత్త వాహనాలను అందించే మహీంద్రా..తాజాగా డ్రైవర్ అవసరం లేని ట్రాక్టర్ ను తీసుకొచ్చింది. చెన్నైలో అభివృద్ధి చేసిన తొలి చోదక రహిత (డ్రైవర్‌లెస్‌) ట్రాక్టర్‌ను మంగళవారం దిల్లీలో ప్రదర్శించింది. డ్రైవర్‌లెస్‌ టాక్టర్‌ టెక్నాలజీని 20 హెచ్‌పీ నుంచి 100 హెచ్‌పీ సామర్థ్యం కలిగిన ట్రాక్టర్లలో అందుబాటులోకి తెచ్చేందుకు మహీంద్రా సంస్థ ప్రణాళికలు చేస్తుంది.

ఈ సందర్భాంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ.. ‘మా పరిశోధన, అభివృద్ధి (ఆర్‌ అండ్‌ డి) విభాగం సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ఎప్పుడూ ముందుంటుంది. డ్రైవర్‌లెస్‌ ట్రాక్టర్‌ను ఈ రోజు ప్రదర్శించడం మాకెంతో గర్వకారణం. దీంతో వ్యవసాయ రంగంలో కొత్త అవకాశాలు వస్తాయి. ఈ నూతన యాంత్రీకరణ పద్ధతిని ప్రపంచ వ్యవసాయరంగానికి అంకితం చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది’ అని అన్నారు.

Related posts:

loading...