‘ఆక్సిజన్’ కు ఆమె గానం..

వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న గోపీచంద్, ఆక్సిజన్ చిత్రం తో దీపావళికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..జ్యోతికృష్ణ డైరెక్ట్ చేసిన ఈ మూవీ , గత కొంతకాలంగా విడుదలకు నోచుకోకుండా ల్యాబ్ కే పరిమితం అయ్యింది. ఈ సినిమాపై ఎవరికీ అంచనాలు లేవు. అందుకే ఈ సినిమాకు క్రేజ్ తీసుకరావడం కోసం నానా కష్టాలు పడుతున్నారు. తాజాగా ఈ మూవీ లో జ్యోతికృష్ణ భార్య ఐశ్వర్య ఓ సాంగ్ పాడిందట.

స్వతహాగా మంచి గాత్రం కలిగిన ఐశ్వర్య పలు అవకాశాలు వచ్చినా పాడలేదు. కానీ జ్యోతికృష్ణ సలహా మేరకు ఈ చిత్రంతో సింగర్ గా ఆరంగేట్రం చేయబోతుంది. ఈ ఆల్బమ్ లో ఐశ్వర్య రెండు పాటల్ని పాడారట. వాటిలో ఒక ఫ్యామిలీ సాంగ్ కూడా ఉందని సమాచారం. ఇప్పటికే పాటల రికార్డింగ్ కూడా పూర్తైందని, పాటలు ప్రేక్షకులకు తప్పక నచ్చుతాయని జ్యోతికృష్ణ చెపుతున్నాడు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో రాశి ఖన్నా, అను ఇమ్మాన్యుయల్ హీరోయిన్లుగా నటించారు.

Related posts:

loading...