అర్జున్ రెడ్డి డైరెక్టర్ కు మైత్రి ఛాన్స్..?

అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్ అయ్యాడు వంగా సందీప్ రెడ్డి..ఈయన డైరెక్షన్ చూసి అగ్ర దర్శకులు మాత్రమే కాదు అగ్ర హీరోలు సైతం ఫిదా అయ్యారు. మంచి కథ ఉంటె ఈయన తో సినిమాలు చేయడానికి రెడీ అని ప్రకటించారు కూడా. ప్రస్తుతం ఏ హీరోతో నెక్స్ట్ సినిమా అనేది తెలియదు కానీ ఈయనకు టాప్ బ్యానర్ ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తుంది.

శ్రీమంతుడు , జనతా గ్యారేజ్ వంటి హిట్ చిత్రాలను నిర్మించిన మైత్రి మూవీస్ సందీప్ రెడ్డి చేతిలో అడ్వాన్ పెట్టినట్లు ఫిలిం సర్కిల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా చేతిలో యాభై లక్షల అడ్వాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మైత్రీ మూవీస్ సంస్థ కేవలం అగ్ర దర్శకులు , అగ్ర హీరోలతోనే కాదు టాలెంట్ ఉన్న కొత్త డైరెక్టర్స్ , హీరోలతో సినిమాలు చేయడానికి ముందుకొస్తుంది. ఇప్పటికే చందు మొండేటి డైరక్షన్ లో నాగ చైతన్యతో ఓ సినిమా చేస్తోంది. ఇప్పుడు కొత్త దర్శకుడు అయిన సందీప్ కు అడ్వాన్స్ ఇచ్చింది. మరి సందీప్ ఎప్పుడు , ఎవరితో సినిమా మొదలు పెడతాడో చూడాలి.

Related posts:

loading...