వైరల్ : కోహ్లీతో కలిసి ఆమీర్ ఖాన్ డ్యాన్స్

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో కలిసి బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెక్ట్ ఆమీర్ ఖాన్ చేసిన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే, ఇది ప్రోమో మాత్రమే. దీపావళి సందర్భంగా హిందీ ఛానెల్ జీ టీవీలో ప్రసారం అయిన ఓ ప్రోగ్రాంలో బాలీవుడ్ న‌టుడు ఆమిర్ ఖాన్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పాల్గొన్న విష‌యం తెలిసిందే. దీనికి సంబంధించిన ప్రోమోని ఆమీర్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇప్పుడీ ప్రోమో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

కోహ్లీతో క‌లిసి ఈ ప్రోగ్రాంలో పాల్గొన‌డం చాలా స‌ర‌దాగా ఉంది. కోహ్లీ ముక్కు సూటి మ‌నిషి. ఎంతో కూల్ గా ఉంటాడు. కోహ్లీ మంచి డ్యాన్స‌ర్ అని ఆమిర్ కితాబిచ్చారు. కోహ్లీ కోరిక మేరకు ఆస్ట్రేలియాతో జరగాల్సిన చివరి టీ20మ్యాచ్ ని వీక్షించేందుకు ఆమీర్ ఖాన్ హైదరాబాద్ విచ్చేసిన విషయం తెలిసిందే. అయితే, దురదృష్ట్యావశాత్తు ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది.

Related posts:

loading...