న్యూజిలాండ్’తో వ‌న్డే సిరీస్‌ కోసం భారత జట్టు ఎంపిక

స్వదేశంలో శ్రీలంక, ఆస్ట్రేలియాల లాంటి పెద్ద జట్లని ఓడించి మంచి హుషారులో ఉంది టీమిండియా. ఈ జోరులోనే న్యూజిలాండ్ తో వ‌న్డే సిరీస్‌ ఆడబోతుంది. ఈ నెల 22 నుంచి ప్రారంభమయ్యే వ‌న్డే సిరీస్‌ కోసం భారత జట్టుని ఎంపిక చేసింది బీసీసీఐ. ఈ సిరీస్ కు స్పిన్నర్లు అశ్విన్, రవీంద్ర జడేజాలని ఎంపిక చేయలేదు. వారికి విశ్రాంతిని ఇస్తున్నట్టు ప్రకటించింది. ఓపెనర్ కె ఎల్ రాహుల్ ని కూడా ఎంపిక చేయలేదు. అయితే, ఆస్ట్రేలియా టీ20 సిరీస్ కు దూరంపెట్టిన రహానె ని తిరిగి జట్టులోకి తీసుకొనారు.

న్యూజిలాండ్ తో వ‌న్డే సిరీస్‌ ఆడబోతున్న భారత జట్టు ఇదే.. విరాట్ కోహ్లీ (కెప్టెన్‌), రోహిత్ శ‌ర్మ‌, శిఖ‌ర్ ధావ‌న్‌, అజింక్యా ర‌హానె, మ‌నీశ్ పాండే, కేదార్ జాద‌వ్‌, దినేశ్ కార్తీక్‌, ఎమ్మెస్ ధోనీ, హార్దిక్ పాండ్యా, ఆక్స‌ర్ ప‌టేల్‌, కుల్దీప్ యాద‌వ్, చాహెల్, బుమ్రా, భువ‌నేశ్వ‌ర్ కుమార్‌, శార్దుల్ ఠాకూర్.

న్యూజిలాండ్ టీమ్‌తో ఇండియా మొత్తం మూడు వ‌న్డేలు ఆడ‌నుంది. ఈ నెల 22న మొదటి వన్డే, 25న రెండో వన్డే, 29న మూడో వన్డే ఆడనుంది.

Related posts:

loading...