తాప్సీ వలవేసి పని జరుపుకుందా

కొన్ని విషయాలు నిజమో కాదో తెలియదు కాని వినగానే భలే కిక్ ఇస్తాయి. ఇది కూడా అలాంటిదే. కాకపోతే నిజం అనడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఇందులో. తాప్సీ టైం ప్రస్తుతం హింది లో కాని తెలుగు లో కాని ఏమంత బాగాలేదు. పింక్ సినిమా తెచ్చిన పేరు మొత్తం నామ్ షబానా పోగొట్టేసింది. ఇక తెలుగులో అవకాశాలు లేక బహు కాలం అయ్యింది. అందుకే హిందిలో ఒక నాలుగైదు అవకాశాలు పట్టే పనిలో బిజీ గా ఉంది.

ప్రస్తుతం తాప్సీ హలో బ్రదర్ సీక్వెల్ జుడ్వా 2 లో వరుణ్ ధావన్ సరసన నటిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి నిన్నటి తరం హాస్య చిత్రాల దర్శకుడు డేవిడ్ ధావన్ కెప్టెన్సీ వహిస్తున్నాడు. నిర్మాత సాజిద్ నడియాడ్ వాలా. వరుణ్ ధావన్ డ్యూయల్ రోల్ చేస్తున్న ఈ మూవీ లో మరో హీరొయిన్ జాక్వెలిన్. ఈ మధ్య సినిమా సెట్ లో ఇద్దరికీ పొసగడం లేదు అనే వార్త బాగా చక్కర్లు కొడుతోంది. దానికి కారణం చూచాయగా బయటికి వచ్చింది.

తాప్సీ ఆ సినిమా నిర్మాతగా ఉన్న సాజిద్ నడియాడ్ వాలా కు సన్నిహితంగా ఉంటూ స్క్రిప్ట్ లో మొదట చెప్పిన దానికి మార్పులు చేయిస్తూ తన పాత్రకు అధిక ప్రాధాన్యత ఉండేలా చూసుకుందట. దీంతో తన కాల్ షీట్స్ కన్నా ఎక్కువ ఇచ్చేలా చేసుకుందట. ఇది కాస్త జాక్వెలిన్ కి తెలిసి తనకు చెప్పకుండా స్క్రిప్ట్ లో మార్పులు ఎలా చేస్తారని, ఉన్నట్టుంది తనతో సమానంగా ఉన్న తాప్సీ పాత్రకు ప్రాధాన్యత ఎలా పెరిగింది అని గొడవ పెట్టుకుందట.

ఈ గోల భరించలేక దర్శకుడు, నిర్మాత కలిసి వీళ్ళిద్దరి కాంబినేషన్ సీన్లు దాదాపు లేకుండా రాసుకున్నారట. ఈ ఇష్యూ వల్లే జాక్వేలిన్ తాప్సీ తో గొడవ పడే దాకా వచ్చిందట. మొత్తానికి తాప్సీ భలే గడుసుపిండం. ఏకంగా నిర్మాతకే వల వేసి తన పాత్ర పరిధిని పెంచుకోవడం అంటే మాటలా. తెలుగులో మాత్రం తాప్సీ ది ఒకే ఒక్క సినిమా వస్తోంది. అదే ‘ఆనందో బ్రహ్మ’. దాని మీద ఎటువంటి అంచనాలు లేవు.

Related posts:

loading...