పెళ్లి కాని హీరో.. సెక్స్ లేకపోతే ఉండలేడట!

హాట్ చాట్ షో గా పేర్గాంచిన కాఫీ విత్ కరణ్ లో సల్మాన్ ఖాన్ గురించి చాలా హాట్ విషయాలనే చెప్పాడు ఆయన సోదరుడు అర్బాజ్ ఖాన్. అత్యంత ముదురు బ్రహ్మచారి అయిన తన అన్నయ్య సల్లూ గురించి ర్యాపిడ్ ఫైర్ రౌండ్ లో అర్బాజ్ గొప్ప విషయాలే చెప్పాడు. ఒకవైపు సల్మానేమో తను ఇంకా వర్జిన్ నే అని చెప్పుకొంటూ ఉంటాడు. ఇదే షోలో కూడా సల్లూ అదే మాట చెప్పాడు.

అయితే ఈ విషయంలో అర్బాజ్ ఏ మాత్రం మొహమాటం లేకుండా అన్నయ్య గురించి చెప్పుకొచ్చాడు. సల్మాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ ‘నో సెక్స్ ఫర్ ఏ మంత్’ అనే ఛాలెంజ్ ను తీసుకోలేడని అర్బాజ్ అన్నాడు. ఈ విషయంలో సందేహం లేదని స్పష్టం చేశాడు. తన అన్నయ్య అది లేకుండా ఉండలేడని అర్బాజ్ చెప్పాడు.

అయితే సల్మాన్ మాత్రం తను వర్జిన్ ని అని మరోసారి స్పష్టం చేశాడు. ఆ విషయంలో మార్పులేదని చెప్పాడు. ఇక రిలేషన్ షిప్స్ విషయంలో తను అంత మంచివాడిని కాదేమో అని సల్లూ వ్యాఖ్యానించగా, షో లో పాల్గొన్న సల్మాన్ సోదరులు మాత్రం.. ఆ విషయంలో అన్నయ్య చాలా మంచివాడని అన్నారు.

సల్మాన్ గురించి కరణ్ మాట్లాడుతూ.. పెద్దలను గౌరవించడాన్ని సల్మాన్ నుంచి నేర్చుకోవాలని తన తల్లి తనతో అంటుంటుందని అన్నాడు. కత్రినాకైఫ్ నర్తించిన ‘షీలా..’ సాంగ్ కు సల్లూ ఈ షో స్టెప్పులేయగా, సల్మాన్ సోదరులు మాత్రం ఆ పాటకు ఆయనే నర్తించాలని, దానికి నర్తించే హక్కు తమకు లేదని చమత్కరించారు!

Related posts:

loading...