మిమ్మల్ని మీరు అద్దంలో నగ్నంగా చూసుకోండి…రాధికా ఆప్టే

ఎవరికి వారు అద్దంలో నగ్నంగా చూసుకుంటే వివాదం ఏముంటుంది.? నగ్నంగా జనంలోకి వస్తేనే తేడా కొట్టేస్తుంది. పాపం, రాధికా ఆప్టేకి తాను చేసిన పనిని ఎలా డిఫెండ్‌ చేసుకోవాలో అర్థం కాక మీడియాపై ఇలా విరుచుకుపడ్తోంది. ‘మీరే నగ్నంగా వున్న నా వీడియోల్ని చూస్తారు.. వాటిని మళ్ళీ మీరే షేర్‌ చేస్తారు.. మళ్ళీ నన్ను మీరే ప్రశ్నిస్తారు.. నన్ను ప్రశ్నించే ముందు మిమ్మల్ని మీరు అద్దంలో నగ్నంగా చూసుకోండి..’ అంటూ ఫైర్‌ అయిపోయింది రాధికా ఆప్టే.

‘పర్‌చేద్‌’ సినిమాలో రాధికా ఆప్టే నగ్నంగా నటించిన విషయం విదితమే. నగ్నంగా కన్పించడం తప్పా.? కాదా.? అనేది వేరే చర్చ. మన దేశంలో మాత్రం నగ్నంగా నటించడం అనేది ఖచ్చితంగా సంచలనమే. ఆ సంచలనం గురించే రాధికా ఆప్టేని మీడియా ప్రశ్నించింది. కారణం, ఆమె నగ్నంగా నటించడమే. దానికి ఆమె సమాధానం చెప్పాలనుకుంటే చెప్పొచ్చుగాక. ‘ప్రపంచంలో ఏం జరుగుతోందో చూడండి.. అక్కడ చాలామంది చేస్తున్నారు.. నేనేం కొత్తగా చేసింది కాదు.’ అంటూ రాధికా ఆప్టే క్లాస్‌ తీసుకుంది.

హాలీవుడ్‌ రేంజ్‌కి బాలీవుడ్‌ సినిమా ఎదిగిందని, ఇదిగో.. రాధికా ఆప్టే, ఇలా మాట్లాడుతోంటేనే అందరికీ అర్థమవుతోంది. అఫ్‌కోర్స్‌ బాలీవుడ్‌ తెరపై నగ్నత్వం ఇదే కొత్త కాదు. అలాగే, ఆ నగ్నత్వం చుట్టూ వివాదాలూ కొత్త కాదు. నగ్నంగా నటించి, తనను తాను డిఫెండ్‌ చేసుకోవడం వుందే.. అదే కాస్త కొత్త. అలవాటైపోతుంది లెండి.. అప్‌ డేట్‌ అవ్వాలి మనమే.!

Related posts:

loading...