పీకల్లోతు ప్రేమలో దర్శకుడు…అతనే ఇచ్చిన సాక్ష్యాలు

అతనో బాలీవుడ్ డైరెక్టర్. సాంప్రదాయక సినిమా ఫార్ములాకు ఎదురీది మరీ అద్భుతమైన సినిమాలు తీసిన వాడు. అతని పేరు చూసి సినిమాకు వెళ్ళేంత ఇష్టాన్ని తన పై వచ్చేలా చేసుకున్న మోస్ట్ టాలెంటెడ్. కాని తెరపై చూపించిన అభిరుచి కాని వ్యక్తిత్వం కాని నిజ జీవితంలో ఉండాలి అని రూల్ ఏమి లేదు. ఆ మాటకొస్తే అతని సినిమాల్లోని పాత్రలు రెగ్యులర్ స్టీరియో టైపు లో కాకుండా చాలా డిఫరెంట్ గా అనిపిస్తాయి. బహుశ తన మనస్తత్వాన్నే తెరపై చూపిస్తున్నాడు కాబోలు.

అతనే అనురాగ్ కశ్యప్. సం ధింగ్ స్పెషల్ అనిపించే సినిమాల దర్శకుడిగా నిర్మాతగా ఉన్న అనురాగ్ ఈ మధ్యే నటుడిగా కూడా కొత్త అవతారం ఎత్తి బాగానే అవకాశాలు దక్కించుకుంటున్నాడు. ఇప్పుడు అతని పర్సనల్ లైఫ్ కి సంబందించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటికి మిగిలిన వాళ్ళకు షాక్ కలిగిస్తే అతన్ని అభిమానించే వాళ్ళకు మాత్రం విస్మయం కలిగిస్తున్నాయి.

అనురాగ్ కశ్యప్ కు మొదట్లో ఆర్తి బజాజ్ తో పెళ్లి జరిగింది. కొంత కాలం బాగానే ఉన్నా తర్వాత ఇద్దరికీ ఒద్దిక కుదరక 2009 విడాకులు ఇచ్చి బ్రేక్ అప్ చెప్పేసాడు. ఆ తర్వాత కల్కి కోచ్లిన్ అనే మరో అమ్మాయిని 2011 లో పెళ్లి చేసుకున్నాడు. తను ఎవరో కాదు. అనురాగ్ తీసిన దేవ్ డి సినిమాలో హీరొయిన్. ఏం జరిగిందో తెలియదు కాని నాలుగేళ్ళు బాగానే కలిసున్నారు కాని ఆ తర్వాత మనస్పర్థలు వచ్చి విడిపోయారు. ఇక్కడితో స్టొరీ అయిపోతే అతను అనురాగ్ ఎందుకు అవుతాడు.

తాజాగా శుభ్రా శెట్టి అనే అమ్మాయితో సహా జీవనం చేస్తున్న అనురాగ్ తనతో చనువుగా ఉన్న ఫోటోలు ఇన్స్టా గ్రామ్ లో షేర్ చేయటంతో బాలీవుడ్ మీడియా మొత్తం మైండ్ బ్లాంక్ అయ్యి చూసింది. ఎందుకంటే అనురాగ్ వయసు 45 కాగా ఆ అమ్మాయి వయసు కేవలం 23. మరి అనురాగ్ లో ఏం నచ్చి అతనికి దగ్గరయ్యిందో కాని మరీ ఇంత గ్యాప్ ఉన్న అమ్మాయిని ఇలా ముగ్గులోకి దింపడం పట్ల కొందరు నిరసన వ్యక్తం చేస్తుండగా కొందరు మాత్రం అనురాగ్ సినిమాలే కాదు లైఫ్ కూడా చాలా స్పైసి గా ఉంది అంటున్నారు.

Related posts:

loading...