బాలయ్య హీరొయిన్ ఆ కుర్రాడితొ డేటింగ్?

సోనాలి చౌహాన్ గుర్తుందిగా. బాలకృష్ణ తో రెండు సినిమాల్లో నటించింది. అందాలు ఆరబోయటమే కాదు పోటాపోటీగా డాన్సులు కూడా బాగా చేసింది. ఇప్పుడు బాలీవుడ్ లో వినిపిస్తున్న గాసిప్ ఏంటంటే అమ్మడు ఒక కుర్రాడితో ప్రేమలో పడింది. ఎవరో కుర్రాడు అయితే ఇంత డిస్కషన్ అక్కర్లేదు. మైనే ప్యార్ కియా సినిమా గుర్తుంది కదా.

సల్మాన్ ఖాన్ కి లైఫ్ టైం బ్రేక్ ఇవ్వడమే కాదు హీరొయిన్ భాగ్యశ్రీని యూత్ కలల రాణిని చేసింది. చాలా కాలం అందులోని పాటలు, వాళ్ళిద్దరి జనాన్ని వెంటాడుతూనే ఉన్నాయి. తర్వాత చాలా అవకాశాలు వచ్చినా కూడా భాగ్యశ్రీ ఎక్కువ సినిమాలు చేయలేదు. కెరీర్ ని అర్ధాంతరంగా ఫుల్ స్టాప్ పెట్టేసి పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. ఇప్పుడు సోనాలి బుట్టలో వేసుకున్న కుర్రాడు ఈ భాగ్యశ్రీ కొడుకే. పేరు అభిమన్యు దసాని.

సినిమాల్లోకి రావడానికి భాగ్యశ్రీ అన్ని సెట్ చేసి పెట్టింది కూడా. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న సినిమా ఇంకా స్టార్ట్ కూడా కాకముందే ఇలా అభిమన్యు సీనియర్ హీరొయిన్ తో చక్కర్లు కొట్టడం పట్ల భాగ్యశ్రీ ఆందోళన చెందుతోంది. వీళ్ళు ఇద్దరు చెట్టాపట్టాలు వేసుకుని ముంబై లో షికార్లు చేయటం బాలీవుడ్ మీడియా కంట్లో కూడా పడింది. ఆ మధ్య జస్టిన్ బ్యాబార్ లైవ్ షో ఇచ్చినప్పుడు తన బర్త్ డే ని అభిమన్యు సోనాలి తోనే సెలెబ్రేట్ చేసుకుని ఆ మేరకు మెసేజ్ కూడా పోస్ట్ చేసాడు.

చాలా డీప్ లవ్ లో ఉన్నట్టు వార్తలు వస్తున్న ఇద్దరిలో ఎవరు కూడా దీనికి స్పందించడం లేదు. భాగ్యశ్రీ తన కొడుకు స్టార్ ఫ్యూచర్ గురించి ఆశలు చాలానే పెట్టుకుంది. తాను స్టార్ హీరొయిన్ అయ్యే అవకాశం చేజేతులా వదులుకుంది కాబట్టి ఇప్పుడు కొడుకు రూపంలో మళ్ళి బాలీవుడ్ జెండా పాతాలని డిసైడ్ అయ్యింది. మొత్తానికి ఇంకా సినిమాల్లోకి రాకముందే మైనే ప్యార్ కియా అంటున్న కొడుకుని ప్రేమ పావురం భాగ్యశ్రీ ఎలా కంట్రోల్ చేస్తుందో.

Related posts:

loading...