ఆ ‘లింగ మార్పిడి’ నటిని భర్త అంతలా వేధిస్తున్నాడట

లింగమార్పిడితో బ్యూటీగా మారిన బాలీవుడ్ నటి బాబీ డార్లింగ్. 23 ఏళ్ల వయసులో గే మ్యాన్ గా 18 పాత్రలు పోషించటం ద్వారా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించారు. బిగ్ బాస్ రియాల్టీ షోలో పాల్గొనటం ద్వారా ఆమె దేశ వ్యాప్తంగా సుపరిచితులుగా మారారు. తాజాగా ఆమె ఊహించని రీతిలో వార్తల్లోకి వచ్చారు.

తన భర్త రామ్మీన్ శర్మ తనను తీవ్రంగా వేధిస్తున్నాడని.. తనకు విడాకులు ఇప్పించాలని కోరింది ఈ ఢిల్లీ భామ. నిత్యం భర్త తనను హింసించటమేకాదు.. అనుమానంతో చూస్తున్న తీరుతో తాను హింసకు గురి అవుతున్నట్లు పేర్కొంది. తాగి వచ్చి తన భర్త తనను కొట్టేవాడని.. ఇతరులతో అక్రమ సంబంధాలు పెట్టుకున్నానని తిడుతుంటాడని ఫిర్యాదు చేశారు.

తనను అసహజ శృంగారానికి పాల్పడుతున్నట్లుగా ఆరోపించిన బాబీ డార్లింగ్.. తన దగ్గరున్న డబ్బులు మొత్తాన్ని తీసేసుకున్నాడని.. తన దగ్గర ఇప్పుడు డబ్బుల్లేవని పేర్కొన్నారు. తన ఆస్తుల్ని రాయించుకొని తనను వేధింపులకు గురి చేస్తున్నట్లుగా పేర్కొన్నారు.

ముంబయిలో తనకున్న ఫ్లాట్ కు కో ఓనర్ గా తన పేరు రాయించుకున్నాడని.. భోఫాల్ లో పెంట్ హౌస్ కొన్నప్పుడు కూడా అదే తీరులో తన భర్త వ్యవహరించినట్లు పేర్కొన్నారు. తన డబ్బుతో ఎన్ యూవీ కారు కొనుగోలు చేశాడని.. ఇప్పుడు తన దగ్గర ఏమీ లేవని ఆమె వాపోతున్నారు. తనను నిత్యం అనుమానిస్తూ.. తనకు ప్రైవేటు సెక్యూరిటీ ఏర్పాటు చేసినట్లుగా ఆమె పేర్కొంది. భర్త నుంచి తన ఆస్తి తనకు వెనక్కి ఇప్పించాలని పేర్కొంది. ఆమె ఆరోపణలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

Related posts:

loading...