ఎక్సైజ్‌ శాఖ లో 1200 పోస్టులకు నోటిఫికేషన్..

ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్‌ శాఖ త్వరలోనే తీపి కబురు తెలుపబోతుంది..ఎక్సైజ్‌ శాఖలో ఖాళీగా ఉన్న 1200 పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్‌ జారీ చేస్తామని ఆ శాఖ మంత్రి కేఎస్‌ జవహర్‌ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో మీడియా తో మాట్లాడిన ఆయన పోస్టులకు సంబదించిన వివరాలను తెలియజేసాడు.

అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో మరికొంత మంది సిబ్బందిని నియమిస్తామన్నారు. సిబ్బందిలో ఆత్మస్థైర్యాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందుకోసం సామర్లకోటలో రూ.20 కోట్లతో శిక్షణ కేంద్రాన్ని, సిబ్బందికి వాహనాలు, ఆయుధాలను సమకూర్చనున్నట్లు చెప్పారు. వీటితోపాటు కొత్తగా 32 చెక్‌పోస్టులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. మద్యాన్ని ఎంఆర్పీ ధరలకే విక్రయించకపోతే రూ.5 లక్షలు జరిమానా విధిస్తామన్నారు.

Related posts:

loading...