రైల్వేశాఖలో కొలువుల జాతర..

అతి త్వరలో రైల్వేశాఖలో భారీగా కొలువుల జాతర మొదలు కాబోతుంది..పది కాదు వెయ్యి కాదు ఏకంగా 2,25,823 కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీ చేయడానికి కేంద్రం ప్రణాళిక సిద్ధం చేసింది. రైల్వే ప్రొటక్షన్‌ ఫోర్స్‌(ఆర్‌పీఎఫ్‌) విభాగంలో అతిపెద్ద ఉద్యోగ నోటిఫికేషన్‌ను విడుదల చేసేందుకు అని సిద్ధం చేసింది కేంద్ర ప్రభుత్వం. దేశవ్యాప్తంగా 2లక్షల25వేల823 ఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ పోస్టులను భర్తీ చేసేందుకు అన్ని సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. ఇప్పటికే రైల్వే శాఖలో అవసరమున్న సిబ్బంది వివరాలను సేకరించి.. మొత్తం భర్తీ చేసేందుకు రెడీ అవుతుందట.

* కేంద్ర ప్రభుత్వ సంస్థ రైల్వేశాఖలో ఆర్పీఎఫ్‌ సిబ్బందిని నియమించేందుకు అధికారులు రెండు దశల్లో ఎంపిక ప్రక్రియను చేపట్టనున్నారు. ఫిజికల్‌ ఎఫిసియెన్సీ టెస్ట్‌ (పీఈటీ), రెండు దశగా రాత పరీక్షను నిర్వహించి.. అర్హత సాధించిన వారికి మెడికల్‌ పరీక్షల అనంతరం విధుల్లోకి తీసుకోనున్నారు.

* రైల్వేశాఖలో ఆర్పీఎఫ్‌ ఉద్యోగానికి పదోతరగతి ఉత్తీర్ణత అర్హతగా కేటాయించారు. 18 నుంచి 25 ఏళ్ల వయస్సు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు నోటిఫికేషన్‌లో వయో పరిమితి సడలింపు ఇస్తారు. ఆర్పీఎఫ్‌ కానిస్టేబుళ్లు రైల్వే శాఖలోని వివిధ పోలీస్‌స్టేషన్ల పరిధిలో పనిచేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా రైల్వేఆస్తులు, ప్రయాణికులు, వస్తువులకు రక్షణ కల్పిస్తారు. అదే విధంగా నేరాలు జరగకుండా సివిల్‌ పోలీసుల సమన్వయంతో పనిచేస్తారు. ఎలెక్షన్స్‌, ఎమర్జెన్సీ సమయాల్లో సహాయ సహకారాలు అందించడంలో ప్రత్యేకపాత్ర పోషిస్తారు.

Related posts:

loading...