బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురుచూడకండి..

ప్రతి ఒక్కరు గవర్నమెంట్ జాబ్ , లేదా బ్యాంకు జాబ్ కోసం ట్రై చేస్తుంటారు..ఎందుకంటే మిగతా జాబ్స్ తో పోలిస్తే సెక్యూర్టీ పరంగా చాల బెటర్. అందుకే చాలామంది యువతీ యువకులు ఏళ్ల తరబడి వీటికోసం ట్రై చేస్తుంటారు. అయితే ఇప్పుడు బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురుచూసేవారికి హెచ్చరిక..ఎందుకంటే రానున్న ఐదేళ్లలో బ్యాంకు ఉద్యోగాలు దరిదాపుగా మూడో వంతు తగ్గిపోనున్నాయి..ఇది మీము చెప్పడం లేదు సిటీ గ్రూప్‌ మాజీ సీఈవో విక్రమ్‌ పండిట్‌ చెబుతున్నారు.

కృత్రిమ మేధస్సు, రోబోటిక్స్‌ కారణంగా వచ్చే ఐదేళ్లలో 30 శాతం బ్యాంకు ఉద్యోగాలు మాయమవుతాయని బ్యాంకుల దైనందిన బాధ్యతలు చూసే సిబ్బందితో పని ఉండదని ఆయన తెలిపారు. ఈ కారణంగా బ్యాంకులు ఉద్యోగాలు చాలావరకు తగ్గించే అవకాశం ఉందని తెలుస్తుంది . కృత్రిమ మేధస్సుతో బ్యాకింగ్‌ వ్యాపారం మౌలిక స్వరూపమే మారిపోతుందని నిపుణులు చెపుతున్న మాట. వచ్చే మూడేళ్ల లో డేటా ఎంట్రీల వంటి దిగువ స్థాయి ఉద్యోగాల అవసరం ఉండకపోవచ్చు. అందుకే బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురు చూసే బదులు మరేదయినా ట్రై చేస్తే మంచిందని అంటున్నారు.

Related posts:

loading...