ప్రఖ్యాత కేంబ్రిడ్జి యూనివర్శిటీ పరీక్షల విషయంలో సంచలన నిర్ణయం

పరీక్షలు అనగానే అంతా కూడా పెన్నులు, పెన్సిల్స్‌ సిద్దం చేసుకుంటూ ఉంటారు. కాంపిటీటివ్‌ పరీక్షలు మినహా మిగిలిన అన్ని పరీక్షలు కూడా పేపర్లకు పేపర్లు విద్యార్థులు నింపాల్సింది. ఎన్ని ఎక్కువ పేపర్లు నింపితే అన్ని ఎక్కువ మార్కులు వస్తాయనే అభిప్రాయం కొందరు విద్యార్థుల్లో ఉంటుంది. కాని ఇకపై పరీక్ష అంటే పేపర్లు కనిపించవు. పరీక్షల విధానంలో పెను మార్పులు తీసుకు వచ్చేందుకు ప్రఖ్యాత కేంబ్రిడ్జి యూనివర్శిటీ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది.

దాదాపు 800 ఏళ్ల ఘన చరిత్ర ఉన్న కేంబ్రిడ్జి యూనివర్శిటీలో పాత తరహా పరీక్షల విధానంకు స్వస్థి చెప్పాలనే నిర్ణయానికి వచ్చారు. ప్రతి పరీక్ష కూడా కంప్యూటర్‌లోనే ఉండాలని నిర్ణయించారు. విద్యార్థులు పరీక్షలను కంప్యూటర్‌ ద్వారా రాస్తారు. ఆ పేపర్లు ప్రింట్‌ చేసి ప్రొఫెసర్స్‌ కరెక్షన్‌ చేస్తారు. ఈ పద్దతి ఏదో బాగుంది కదా.. తప్పకుండా ఇండియాలో ఇప్పుడు కాకున్నా మరో పది లేదా ఇరవై సంవత్సరాలకు అయినా వస్తుంది.

Related posts:

loading...