తెలంగాణ పోలీస్‌ శాఖలో 26వేల పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్

తెలంగాణ రాష్ట్రం ఏర్పటు జరిగిన తర్వాత తెరాస సర్కార్ రాష్ట్రం లో ప్రతి శాఖల్లో భారీ ఎత్తున ఖాళీ పోస్టులను భర్తీ చేస్తూనే వస్తుంది. అలాగే పోలీస్ శాఖల్లో కూడా అదే రీతిలో పోస్టులను ప్రకటించింది. త్వరలో 26 వేల ఖాళీలను భర్తీ చేస్తామని తెలంగాణ డీజీపీ అనురాగ్‌ శర్మ తీపి కబురు తెలిపారు. ప్రతి పోలీస్‌స్టేషన్‌లో 33 శాతం మహిళా సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు.

గోదావరిఖని వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ భవన నిర్మాణానికి ఆయన ముఖ్య అతిధిగా వచ్చి శంకుస్థాపన చేశారు. త్వరలో రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని వెల్లడించారు. అనురాగ్‌ శర్మ తెలిపిన తీపి కబురు కు యువత హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Related posts:

loading...