టీటీడీ లో కొలువులు..

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వేద పాఠశాలల్లోని ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. తిరుపతి, విజయనగరం, కీసరగుట్ట, చిలుకూరు, భీమవరం, నల్లగొండ, కోటప్పకొండ వేద పాఠశాలల్లోని అధ్యాపక పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు సంబంధించి కింది అర్హతలు కలిగి ఉండాలి.

* కృష్ణ‌ యజుర్వేదం, సామవేదం, శాస్త్ర పండిట్, శైవ ఆగమం, రుగ్వేదం, అథర్వణ వేదం, కేర్ టేకర్ వంటి వాటిల్లో నైపుణ్యం కలిగి ఉండాలి.

* విద్యార్హతలు విషయానికి వస్తే.. అధ్యాపక పోస్టులకు వేదం (కర్మాంత/ ఘనానంతం/ కృష్ణ‌ యజుర్వేదం/ సామవేదం)/ పౌరోహిత్యం/ సమర్థం అభ్యసించి ఉండాలి/ సంస్కృతంలో పోస్ట్-గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉండాలి. కేర్‌టేకర్ పోస్టులకు వేద/ ఆగమ/ పౌరోహిత్యం/ శాస్త్రంలో సర్టిఫికెట్ ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. హిందువులు మాత్రమే దరఖాస్తు చేయడానికి అర్హులు.

వయసు: 2017 మే 29 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైనవారికి ఉచిత వసతులను కూడా కల్పిస్తారు.
దరఖాస్తు: పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తులను Assistant Executive Officer, SVIHVS, TTD,Tirupati, SVETA Building, Chandragiri Road, Tirupati-517502, Andhra Pradesh చిరునామాకు పంపాలి.
చివరితేది: జూన్ 25

Related posts:

loading...