ఏపీడీఈఈసెట్‌-2017 ఎంట్రన్స్ ఎక్సమ్ రిజల్ట్స్..

ఏపీ డీఈఈసెట్‌-2017 ఎంట్రన్స్ ఎక్సమ్ రిజల్ట్స్ విడుదల అయ్యాయి..మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ ఫలితాలను మీడియా ముందు విడుదల చేసి కౌన్సెలింగ్‌ ఎప్పుడు..ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు మొదలగు విషయాలను తెలిపారు. 72,259 మంది విద్యార్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోగా 53,962 మంది పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. వీరిలో 39,632 మంది అర్హత సాధించినట్లు ఆయన తెలిపారు.

గణితంలో పవన్‌కుమార్‌ 90 మార్కులతో ప్రథమస్థానం
కె.లత 85 మార్కులు ద్వితీయ స్థానం
వైఎన్‌. కీర్తి 85 మార్కులు తృతీయ స్థానాల్లో నిలిచారు.
భౌతికశాస్త్రం ఏసీ సరోజ 78 మార్కులు ప్రథమస్థానం
టి.సాయిసంతోష్‌ ఆదిత్య 78 మార్కులు ద్వితీయ స్థానం
టి.నూర్‌యాని 77మార్కులు తృతీయ స్థానాలు దక్కించుకున్నారు.

బయోలాజికల్‌ సైన్స్‌ జి.తేజస్వి 84 మార్కులతో ప్రథమస్థానం
బి.లక్ష్మీనాథ్‌ 80 మార్కులతో రెండో స్థానం
ఎం.సౌమ్య 78 మార్కులతో తృతీయస్థానం

సాంఘికశాస్త్రంలో టి.వనజ 72 మార్కులతో ప్రథమస్థానం
వి.సాయిబాబు 72 మార్కులతో రెండో స్థానం
పి.మహెముదా 69 మార్కులతో మూడో స్థానం సాధించారు.

డైట్‌సెట్‌ 2017 వెబ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ప్రకారం మొదటి విడత ఈ నెల 19 నుంచి 21 వరకు వెబ్‌ఆప్షన్ల నమోదు, 25న సీట్ల కేటాయింపు చేయనున్నారు. ఈ నెల 26 నుంచి వచ్చేనెల 5వరకు ధ్రువీకరణ పత్రాల పరిశీలన నిర్వహించనున్నారు.

Related posts:

loading...