హ్యుందాయ్‌ నుండి సెడాన్‌ కొత్త వెర్నా

ప్రముఖ కొరియన్‌ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్‌ లేటెస్ట్ గా సీ-సెగ్మెంట్‌ సెడాన్‌ కొత్త వెర్నాను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ కారు బేస్‌ వేరియంట్‌ ధర రూ.7.99 లక్షలు కాగా దీని టాప్‌ వేరియంట్‌ ధర రూ.12.1 లక్షల వరకు ఉన్నట్లు తెలిపింది. అయితే ఈ ధరల్లో తొలి 20వేల కస్టమర్లకు మాత్రమే కొత్త వెర్నా అందుబాటులో ఉండనుంది. ఆ తర్వాత సమీక్షించిన ధరల ప్రకారం, ఈ కొత్త వెర్నా ధర పెరుగనుంది.

ఇక దీని ఫీచర్స్ విషయానికి వస్తే..

* 1.6 లీటరు పెట్రోల్‌, డీజిల్‌ మోటార్స్‌ను ఈ కొత్త వెర్నా కలిగి ఉంది.
* పెట్రోల్‌ ఇంజిన్‌ 123 బీహెచ్‌పీ
* 151 ఎన్‌ఎం టర్క్‌ శక్తిని ఉత్పత్తి చేస్తుంది.
* డీజిల్‌ ఇంజిన్‌ 128బీహెచ్‌పీ, 260ఎన్‌ఎం టర్క్‌ను ప్రొడ్యూస్‌ చేస్తుంది.
* ముందు వైపు ప్రొజెక్టర్‌ హెడ్‌ల్యాంప్స్‌
* ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్స్‌
* వెనుకవైపు ఎల్‌ఈడీ టైల్‌ ల్యాంప్స్‌
* 7 అంగుళాల టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌
* బ్లూటూత్‌
* యూఎస్‌బీ, ఆపిల్‌ కారుప్లే,
*ఆండ్రాయిడ్‌ ఆటో సపోర్టులతో పాటు… భద్రతాపరంగా 6 ఎయిర్‌బ్యాగ్స్‌, ఈబీడీతో ఏబీసీ, ఈఎస్‌సీలు ఉన్నాయి.

Related posts:

loading...