వరల్డ్ లోనే అత్యధిక ధర కలిగిన కార్ ఇదే..

ప్రపంచం లోనే అత్యధిక ధర కలిగిన కార్ ప్రజల మధ్య కు వచ్చి ఆశ్ఛర్యం కలిగించింది. బుగాట్టీ చిరాన్‌పేరుతో కలిగిన సరికొత్త కార్ మార్కెట్లోకి వచ్చింది. దీని ధర అక్షరాల రూ.19.21కోట్లు. దీని అత్యధిక వేగం గంటకు 420 కిలోమీటర్లు.

ఈ సరికొత్త కారును అమెరికాలోని పెబల్‌బీచ్‌లోని ఒక కస్టమర్‌కు డెలివరీ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 500 కార్లను మాత్రమే విక్రయించనున్నారు. ఇప్పటికే సగానికిపైగా ఈ కార్లు బుక్‌ అయ్యినట్లు సంస్థ తెలిపింది. నలుపు తెలుపు రంగుల్లో ఈ కార్ ఉండనుంది.

దీని ప్రత్యేకతలు చూస్తే..

* 1.600 ఎన్‌ఎం టార్క్‌ వద్ద 1500 బీహెచ్‌పీ శక్తిని విడుదల చేస్తుంది.
* అత్యంత సౌకర్యవంతమైన ఇంటీరియర్‌తో దీనిని తీర్చిదిద్దారు.
*దీనిలో 8లీటర్‌ డబ్ల్యూ16 ఇంజిన్‌ను వినియోగించారు.
*దీనిలో రెండుదశల టర్బోఛార్జర్‌ ఇంజిన్‌ ఉంది.
*ఈ టెక్నాలజీని బుగాట్టీ తొలిసారి వినియోగిస్తోంది.
*ఇది అత్యధికంగా గంటకు 420 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు.

Related posts:

loading...