మార్కెట్లోకి నానో ఎలక్ట్రిక్‌ కారు ..

నానో ఈ పేరు చాలామందికి తెలిసే ఉంటుంది. కేవలం లక్ష రూపాయలకు నానో కార్ అంటూ టాటా మోటార్స్ ప్రకటించి సంచలనం సృష్టించారు. కేవలం లక్ష అనగానే చాలామంది వీటిని కొనుగోలు చేసారు. కానీ ఇవి మార్కెట్లో అంత సక్సెస్ కాలేదు. దీంతో టాటా మోటార్స్ వారు మార్కెట్లోకి నానో ఎలక్ట్రిక్‌ కారును తీసుకొచ్చే పనిలో పడ్డారు.

‘ఇప్పటికే దీనికి సంబంధించిన పరీక్షలు విజయవంతమైనట్లు తెలిసింది. నానోను మార్కెట్‌ నుంచి తప్పించే ఆలోచనేలేదు. ఇది కంపెనీ, రతన్‌టాటా, షేర్‌ హోల్డర్ల సెంటిమెంట్‌తో ముడిపడిన అంశం. దీంతో ప్రస్తుత స్థానాన్ని మెరుగుపర్చుకునే అంశాన్ని పరిశీలిస్తున్నాం’ అని సంస్థ తెలిపింది. టాటా ప్రస్తుతం గుజరాత్‌లోని సనంద్‌ ప్లాంట్‌ నుంచి నానోను ఉత్పత్తి చేస్తోంది. ఇదే ప్లాంట్‌లో టియాగో, టిగారోలను కూడా ఉత్పత్తి చేస్తున్నారు.

Related posts:

loading...