భారత్ లోకి ఆడీ సరికొత్త మోడల్ ను తీసుకొచ్చింది

ధనవంతులు ఎంతో ఇష్టపడే కార్లలో ఆడీ ఒకటి. ఈ కంపెనీ నుండి మోడల్ మార్కెట్లోకి వస్తుందంటే అందరి చూపు దీనిపై నే ఉంటుంది. ఆడీ తన ఫ్లాగ్‌షిప్‌ మోడల్‌ క్యూ7లో పెట్రోల్‌ వేరియంట్‌ను భారత్‌లో విడుదల చేసి ఆకట్టుకుంది. దీని ప్రారంభ ధర రూ. 67లక్షలుగా సంస్థ నిర్ణయించింది.

ఈ మోడల్ లోని ప్రత్యేకతల విషయానికి వస్తే..

* టాప్‌వేరియంట్‌ ధర రూ.74.43లక్షలు. లీటర్‌ పెట్రోల్‌కు 11.68 మైలేజీని ఇస్తుంది.
* అలాగే 2 లీటర్ల 4 సిలిండర్‌ ఇంజిన్‌ను అమర్చడం జరిగింది.
* 370 ఎన్‌ఎం టార్క్‌ వద్ద 248 బీహెచ్‌పీ శక్తిని విడుదల చేస్తుంది.
* దీనిలో 8 స్పీడ్‌ ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌నుతో ఆల్‌వీల్‌డ్రైవ్‌ (ఎడబ్ల్యూడీ)ని అనుసంధానించారు.
* ఈ కారు అత్యధికంగా 233 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

Related posts:

loading...